నవంబర్ 10 (ఆంధ్రపత్రిక): మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ చకచక జరుగుతోంది. సినిమాను దిల్ రాజు భారీ బ్జడెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. శంకర్ మొదటి సినిమా అవ్వడంతో పాటు చరణ్ కు ఇది అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవ్వడంతో దిల్ రాజు ఏమాత్రం రాజీ పడకుండా భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఉన్నాడట. ఇప్పటికే వందల కోట్ల బడ్జెట్ ను ఈ సినిమా కోసం దిల్ రాజు ఖర్చు చేశాడు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక విజువల్ వండర్ అనిపించేలా పాటను చిత్రీకరించబోతున్నారట. ఆ పాట కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. న్యూజిలాండ్‌లో ఆ పాటను చిత్రీకరించబోతున్నారట. పాట చిత్రీకరణ కోసం బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ధృవ సినిమా లోని నీతోనే.. అనే పాటకు వర్క్ చేసిన బాస్కో మార్టిస్ ఈ పాటకు వర్క్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలోని ఆ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. శంకర్ సినిమాల్లో ఒకటి రెండు పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఈ పాట శంకర్ మార్క్‌గా ఉంటుందని యూనిట్ సభ్యులు ధీమా ను వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని కూడా వారు పేర్కొంటున్నారు. థమన్ స్వరపర్చబోతున్న ఈ పాట కు సంబంధించిన ట్యూన్ ఇప్పటికే రెడీ అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. అంజలి కూడా ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతుంది. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!