వేయికోట్ల బడ్జెట్‌తో ముందుకు వచ్చిన నిర్మాణ సంస్థ
నవంబర్ 11 (ఆంధ్రపత్రిక): తమిళనాట మణిరత్నం భారీ బ్జడెట్‌తో రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి..మంచి టాక్ సంపాదించింది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రెండు పార్ట్‌లుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఒక పార్ట్ విడుదల అయ్యింది. రెండవ పార్ట్ వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాట భారీ బ్జడెట్ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పొన్నియిన్ సెల్వన్ ఫలితంను బట్టి క్లారిటీ వచ్చింది. అందుకే ముందు ముందు మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు అక్కడ తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడిక్ మూవీ రూపొందబోతుంది. ఆ సినిమాలో హీరోగా సూర్య నటించబోతున్నట్లుగా తమిళ విూడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే సహజంగానే భారీ బ్జడెట్‌ని ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటిది సూర్యతో శంకర్ తెరకెక్కించబోతున్న సినిమాకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శంకర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత సూర్య హీరోగా సినిమా మొదలు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. వేల్పారి చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుందట. ఈ సినిమాకు వెయ్యి కోట్ల బ్జడెట్ ఖర్చు అవుతుందట. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉందట. అంతే కాకుండా ఈ సినిమాను ఒక్క పార్ట్‌లో కాకుండా రెండు లేదా మూడు పార్ట్‌లుగా విడుదల చేసే విధంగా దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు. తమిళనాట ఎన్నో తరాల రాజులు రాజ్యం ఏలారు. అందులో ఒక తరం వేల్పారి రాజులది కూడా ఉంది. ఆ రాజ్యం కు సంబంధించిన విషయాలు, రాజుకు సంబంధించిన విషయాలను చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులకు చూపించేందుకు దర్శకుడు శంకర్ రెడీ అవుతున్నాడట.