ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
అమరావతి,డిసెంబర్ 17 (ఆంధ్రపత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ తరగతి వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానున్నారు. 2024-25 నుంచి పదో తరగతిలోనూ సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. అందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.