Andhra Patrikaa
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
    • అంతర్జాతీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024
Facebook Twitter Instagram
Trending
  • ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
  • ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
  • AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..
  • AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
  • Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
  • AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
  • Running Train: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
  • సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Facebook Twitter Instagram
Andhra PatrikaaAndhra Patrikaa
Demo
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
    • అంతర్జాతీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
EPAPER
Andhra Patrikaa
Home»తాజావార్తలు»తారకరత్న కుమార్తెను ఈ స్థితిలో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే..
తాజావార్తలు

తారకరత్న కుమార్తెను ఈ స్థితిలో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే..

adminBy adminFebruary 19, 2023Updated:February 19, 2023No Comments4 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Seeing Tarakaratna's daughter in this condition would break anyone's heart.
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

#RIPTarakaRatna TarakaRatna Live Updates:

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన..

తండ్రి భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తారకరత్న కుమార్తె నిషిక

08:30 AM: స్వగృహానికి చేరుకున్న నందమూరి తారకరత్న భౌతికకాయం
08:00 AM: తారకరత్న మృతికి సంతాపంగా ప్రకటన విడుదల చేసిన నందమూరి తారకరత్న అభిమానుల సంఘం
07:40 AM: తారకరత్న దూరం కావడంతో టీడీపీ యువనేత నారా లోకేష్ ఎంత భావోద్వేగ ట్వీట్ చేశారంటే..
07:30 AM: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తారకరత్న మృతదేహం తరలింపు. హాస్పిటల్‌ వెనుక గేటు నుంచి అంబులెన్స్‌లో తరలింపు. హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని మోకిలలోని నివాసానికి తరలింపు. అభిమానుల సందర్శనార్థం రేపు తెలుగు ఫిలిం చాంబర్‌లో భౌతికకాయం. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు ఫిలిం చాంబర్‌లో తారకరత్న భౌతికకాయం. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు.
* జనవరి 27న లోకేష్‌ పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న

* లోకేష్‌ పాదయాత్ర మొదటి రోజు గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న

* జనవరి 28న బెంగళూరు హృదయాలయ ఆస్పత్రికి తరలింపు

* నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూత

* తారకరత్న తండ్రి మోహనకృష్ణ, తాత ఎన్టీఆర్‌

* తారకరత్న భార్య అలేఖ్య, కూతురు నిషిక

* 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న

* 2002లో నందమూరి వారసుడుగా సినీరంగ ప్రవేశం చేసిన తారకరత్న

* ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన తారకరత్న

* ఒకటో నెంబర్‌ కుర్రాడు, యువరత్న, తారక్‌, భద్రాద్రి రాముడు, విజేత..

* అమరావతి, నందీశ్వరుడు, ఎదురు లేని అలెగ్జాండర్‌, మహా భక్త సిరియాళ..

* కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించిన తారక్‌

* హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 23 చిత్రాల్లో నటించిన తారకరత్న

* 2009లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్‌గా తారకరత్నకు నంది అవార్డు

* షూటింగ్ దశలో ఉన్న రెండు చిత్రాలు.. రిలీజ్‌కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్

* గతేడాది ‘9 hours’ అనే వెబ్‌సిరీస్‌లో నటించిన తారకరత్న
06:30 AM: నేడు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు నారా లోకేష్. తారకరత్నకు నివాళులర్పించనున్న టీడీపీ యువనేత. సోమవారం నాడు తారకరత్న అంత్యక్రియలు
06:15 AM: ప్రముఖుల సంతాపం..
నందమూరి తారకరత్న మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతిని, బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి దూరమై.. తమ కుటుంబానికి విషాదం మిగిల్చారన్నారు. తారకరత్న మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాగా, తారకరత్న కోలుకుంటారని భావించానని, కానీ.. మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. ‘బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు… నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది… నందమూరి తారకరత్న మృతి దిగ్ర్భాంతికి గురి చేసింది’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
‘తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు… నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహబంధం మన బంధుత్వం కంటే గొప్పది… తారకరత్నకు కన్నీటి నివాళులు’’ అని ఆయన పేర్కొన్నారు. తారకరత్న మృతి పట్ల ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యతు ఉన్న తారకతర్న చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన మరణం ఎన్టీఆర్‌ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు.. తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

06:10 AM: టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి 11గంటలకు తారకరత్న పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ నగర శివార్లలోని మోకిలలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం అక్కడే ఉంచి సోమవారం ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

06:00 AM: గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రముఖ న్యూరాలజిస్ట్‌, విదేశీ వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స కొనసాగించారు. గత రెండు రోజులుగా తారకరత్న ఆరోగ్యం జటిలమైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత వెంటిలేటర్‌ తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్‌ తరలిస్తారంటూ శనివారం ప్రచారం సాగింది. కానీ, అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం రాత్రి ప్రకటించాయి. ఆయనకు మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అంతకుముందునుంచీ ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందువల్లే పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొంత ఒత్తిడికిలోనై తారకరత్న గుండెపోటుకు గురయ్యారని పేర్కొన్నాయి. కాగా, తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తె నిషిక తొలిరోజు నుంచే ఆస్పత్రిలోనే ఉన్నారు.

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
admin
  • Website

Related Posts

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024

Leave A Reply Cancel Reply

Demo
Top Posts

చింతూరు మన్యం లో కలకలం రేపిన జంట హత్య. -ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

December 3, 20234,378

జంట హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

December 9, 2023754

అట్టహాసంగా ఆక్సఫర్డ్ స్కూల్ పువ్వుల దినోత్సవం

August 12, 2023646

పశుసంవర్ధక శాఖలో పారా సిబ్బంది పై ఉన్నతాధికారుల వేధింపులు నిరోధించాలి..!

August 4, 2023547
Don't Miss
ఆంధ్రప్రదేశ్

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

By adminNovember 14, 2024264

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ANDHRAPATRIKA : –   14-11-2024 న ఆక్స్ఫర్డ్…

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024

AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!

November 4, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
About Us

Andhrapatrikaa, the online Telugu news portal from the Andhra Patrikaa Media Group, brings you news as it breaks, from across the world.

Email Us: info@andhrapatrikaa.com
Contact: +91-984-999-8069

Facebook Twitter Pinterest YouTube WhatsApp
Our Picks

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024
Most Popular

చింతూరు మన్యం లో కలకలం రేపిన జంట హత్య. -ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

December 3, 20234,378

జంట హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

December 9, 2023754

అట్టహాసంగా ఆక్సఫర్డ్ స్కూల్ పువ్వుల దినోత్సవం

August 12, 2023646
© 2025 © All rights reserved. By Andhra Patrikaa.
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • CONTACT US
  • ABOUT US
  • FEEDBACK

Type above and press Enter to search. Press Esc to cancel.