మచిలీపట్నం నవంబర్ 18 ఆంధ్రపత్రిక.:
బందరు నియోజకవర్గ బిజెపి ఇంచార్జి సోడిశెట్టి బాలాజీ రావు..!
పేద ప్రజలకు రేషన్ సరఫరా చేసే వాహనాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడం శోచనీయమని, పథకాలకు సాయం అందించేది కేంద్రం అయితే, స్టిక్కర్లు రాష్ట్రాని వా? అని బందరు నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ సోడిశెట్టి బాలాజీ రావు అన్నారు.
శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బిజెపి శ్రేణులతో కలిసి బాలాజీ రావు మెమోరాండం సమర్పించారు.
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రేషన్ పంపిణీ వాహనాలపై , భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా యువమోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షులు శ్రీ నాగలింగం అయోధ్య రామచంద్రరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం తాహసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని బాలాజీ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పాల రామాంజనేయులు , నడకుదిటి గాయత్రి , అభినందన, మత్తి వెంకటేశ్వరరావు వెన్నా ఫణి రాజు, అంజనాదేవి, పద్మజ ,దుర్గ, సుబ్బారావు, శీను, హరికృష్ణ, బొర్రా రాధా, విజయ్ అనిల్, అమ్మాజీ, ఈశ్వర్ , రాంబాబు, బిజెపి నాయకులు,బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.