ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు దీపావళికి పండగలాంటి వార్త చెప్పింది. హౌజింగ్ లోన్స్‌పై మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. గృహ రుణాలపై భారీ డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. గృహ రుణాన్ని 65 బేసిక్ పాయింట్స్ వరకు తగ్గించారు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని తెలిపింది….
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. మొన్నటి వరకు దసరా వేడుకలు జరిగాయి. ఇక ఇప్పుడు దీపావళి సీజన్ మొదలైంది. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడంలో ఈ కామర్స్ సైట్స్ మొదలు, బ్యాంకుల వరకు అన్ని ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ కామర్స్ సైట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు దీపావళికి పండగలాంటి వార్త చెప్పింది. హౌజింగ్ లోన్స్‌పై మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. గృహ రుణాలపై భారీ డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. గృహ రుణాన్ని 65 బేసిక్ పాయింట్స్ వరకు తగ్గించారు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2023 వరకు అందుబాటులో ఉండనుంది.
సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ డిస్కౌంట్‌ను అందించనున్నారు. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఖాతాదారులు అంత ఎక్కువ డిస్కౌంట్స్ పొందొచ్చని ఎస్బీఐ తెలిపింది. వీరితోపాటు అదనంగా హోమ్ లోన్ టేకోవర్ లేదా రెడీ-టు-మూవ్ ఎంపికపై 20 bps అదనపు తగ్గింపును అందిస్తున్నారు. ఈ తగ్గింపు CIBIL స్కోర్ 700 పాయింట్ల కంటే ఎక్కువగా ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉన్న వారికి హౌజ్లోన్పై 65 బీపీఎస్ రాయితీని పొందొచ్చు. 8,70 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందొచ్చు. ఇక 650 నుంచి 699 మధ్య సిబిల్ స్కోర్ ఉన్న వారికి ఎలాంటి రాయితీ ఉండదు. వీరికి 9.45 శాతానికి రుణం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే లోన్స్‌తో పాటు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై కూడా ఆఫర్లు అందిస్తున్నారు. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు ఎన్నో ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్‌లో ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఫ్యాషన్, ఫర్నీచర్ వంటి వాటిపై డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈఎంఐపై కొనుగోలు చేసిన వారికి అదనంగా క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ నవంబర్ 15వ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది.