అమరావతి,అక్టోబర్19 (ఆంధ్రపత్రిక): నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్బిఐ వెల్ల డిరచింది. అభ్యర్థులకు ఎపి లోని గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.. హైదరాబాద్ సెంటర్లలో రాతపరీక్షలను నిర్వహించ నున్నారు. ఆయా పోస్టుల్లో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 7 వరకు ఆయా ఉద్యో గాలకు అభ్యర్థులు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బిఐ సూచించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా లేదా వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 1422 పోస్టుల్లో అసోం, అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహారాష్ట్ర, గోవాకు 212, రాజస్థాన్‌కు 201, తెలంగాణకు 176, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులకు 175.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 175 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్బిఐ ప్రకటించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలని భావిస్తున్న అభ్యర్థుల వయో పరిమితి 21`30 ఏళ్లుగా ఉండాలి. రిజర్వుడ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు విద్యార్హత పొందిన తర్వాత రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. మేరకు ఏదైనా కమర్షియల్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం ఉండాలని సూచించారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!