100మంది విద్యార్థులకు స్టీలు గ్లాసుల పంపిణీ
హర్షం వ్యక్తంచేసిన ఉపాధ్యాయులు,విద్యార్థులు
వేపాడ,మార్చి,29(ఆంధ్ర పత్రిక ):- మండలంలోని చినగుడిపాల సర్పంచ్ భోజంకి రామునాయుడు ఇచ్చిన హామీ నిలుపుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఇటీవల ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్దలో భాగంగా రాగిజావ కార్యక్రమం ప్రారంభోత్సవంలో నీలకంఠరాజపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన చినగుడిపాల సర్పంచ్ అక్కడి విద్యార్థులు ప్లాస్టిక్ గ్లాసుల్లో రాగిజావ తాగుతున్న దృశ్యాన్ని చూసి చలించి స్టీలు గ్లాసులు అందజేస్తానని హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆయన దృఢమైన 100స్టీలు గ్లాసులను కొనుగోలు చేసి బుధవారం ఉపాధ్యాయులు, పలువురు నాయకుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చప్ప కృష్ణారావు సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేచలపు నాయుడుబాబు,ఉపసర్పంచ్ లండదేముడు,స్కూలు కమిటీ చైర్మన్ లండ అప్పన్న,కోట అప్పలనాయుడు,బంటు శ్రీనివాసరావు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!