అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్… కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా ప్లాప్‌లతో సతమతమవుతున్న సందీప్‌కు ’ఎక్స్‌ప్రెస్’ కాస్త ఊరట నిచ్చింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ చిత్రంతో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ’మైఖేల్’ ఒకటి. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన సందీప్ లుక్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే చిత్రబృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటే శ్వరా సినిమాస్ ఎల్ఎల్పి,కరణ్ సి.ప్రొడక్షన్స్ బ్యానర్లపై పుస్కుర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!