సిటాడెల్ వెబ్‌సీరిస్ షూట్‌తో బిజీ
యశోద సినిమాతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న స్టార్ హీరోయిన్ సమంత తిరిగి సినిమాలతో బిజీ కానుందన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ విూడియాలో హల్ చల్ చేస్తోంది. నటుడు వరుణ్ ధావన్ తో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. ముంబైలో ఈ యాక్షన్ సిరీస్ చిత్రీకరణ షురూ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సామ్ చేసిన ఓ పోస్ట్ ఆ వార్తలు నిజమేనని నిరూపించేవిగా ఉన్నాయి. ఈ ఫొటోల్లో చిత్ర యూనిట్ తో సామ్ ముచ్చటిస్తూ కనిపించింది. దాంతో పాటు షేర్ చేసిన మరొక ఫొటోలో సమంత బెడ్ పై పడుకొని ఉంది. అంటే సైలెన్స్‌తో లేవలేని స్థితి నుంచి మళ్లీ మామూలు స్థితికి వచ్చానని సామ్ చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ తో సమంత మళ్లీ సినిమాలను చేయనుందని ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దాదాపు ఏడెనిమిది నెలలు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత.. ఇప్పుడు కోలుకుందని సామ్ అభిమానులు సంబరపడి పోతున్నారు. ఇక సిటాడెల్ సిరీస్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకె దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా భారీ బ్జడెట్ తో దీన్ని నిర్మించబోతుండడం చెప్పుకోదగిన విషయం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!