ప్రపంచంలోనే అతిపెద్దదైన బెల్జియంలోని చాక్లెట్ ప్లాంట్‌లో సాల్మోనెల్లా బ్యాక్టీరియాను గుర్తించారు. వీజ్ పట్టణంలో ఉన్న ఈ ప్లాంట్‌ను స్విస్ దిగ్గజం బారీ కాల్‌బాట్ కంపెనీ నిర్వహిస్తోంది. మొత్తం 73 మంది క్లెయింట్స్‌కు కాన్ఫెక్షనరీల తయారీ కోసం హోల్‌సేల్‌గా ఇక్కడ లిక్విడ్ చాక్లెట్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే, బ్యాక్టీరియా బయటపడిన వెంటనే ఉత్పత్తిని నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ తెలిపారు.
బ్యాక్టీరియా బయటపడగానే బారీ కాల్‌బాట్ తమ కస్టమర్లతో మాట్లాడింది. తాజాగా తమ నుంచి అందుకున్న చాక్లెట్ లిక్విడ్‌తో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయొద్దని కోరింది. అంతేకాదు, తదుపరి నోటీసు వచ్చే వరకు వీజ్ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.