ఎండలు మండుతుండడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి చల్లదనాన్ని ఇచ్చే అప్లియెన్స్‌లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. ఈ సారి సేల్స్ బాగుంటాయని కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు సాధారణ స్థాయికి కంటే ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. 2019 సమ్మర్‌తో పోలిస్తే ఈ ఏడాది సమ్మర్లో ఏసీల అమ్మకాలు 30 శాతం పెరుగుతాయని కంపెనీలు అంచనావేస్తున్నాయి. మొదటిసారిగా కొనేవాళ్లు, పాత అప్లియెన్స్‌లకు బదులుగా కొత్తవి తీసుకునేవాళ్లు పెరుగుతుండడంతో ఏసీలకు డిమాండ్ ఎక్కువయ్యిందని కంపెనీలు చెబుతున్నాయి. ఇండ్లు, ఆఫీస్‌ల కన్స్ట్రక్షన్ పెరగడంతో కూడా ఏసీలకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు. సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్టవుతోందని, ఏసీలకు మంచి డిమాండ్ ఉందని బ్లూస్టార్ ఎండీ బీ త్యాగరాజన్ పేర్కొన్నారు. 2019 సమ్మర్‌తో పోలిస్తే ఈ సారి సమ్మర్లో 20?25 శాతం ఎక్కువ గ్రోత్‌ను నమోదు చేస్తామని ఆయన అంచనావేశారు. డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నుంచి ఏసీల కోసం ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని, డిమాండ్‌ను ఈ సెగ్మెంట్లే ముందుండి నడుపుతున్నాయని త్యాగరాజన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆఫీస్‌లు, రెస్టారెంట్లు, ఫిట్నెస్ సెంటర్లు వంటి చిన్న బిజినెస్‌ల నుంచి ఏసీలకు డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. పెంటప్ డిమాండ్ వలన దేశంలోని అన్ని ప్రాంతాలలో సేల్స్ పెరుగుతాయని అంచనావేస్తున్నామని పానాసోనిక్ బిజినెస్ హెడ్ (ఏసీ) గౌరవ్ షా పేర్కొన్నారు. స్మార్ట్, ఇన్వెర్టర్ ఏసీలకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.కరోనా సంక్షోభం వలన గత రెండేళ్లలో ఏసీలు, పెద్ద అప్లియెన్స్‌ల సేల్స్ పెద్దగా పెరగలేదు. కన్?స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోవడం, కరోనా రిస్ట్రిక్షన్ల వలన హోమ్ అప్లియెన్స్‌ల సెగ్మెంట్లో పెద్దగా గ్రోత్ నమోదు కాలేదు. దీంతో ఈ ఏడాది సమ్మర్‌పై ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తయారు చేసే కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. స్టీల్, అల్యూమినియం వంటి కమోడిటీ రేట్లు పెరగడం, రవాణ ఖర్చులు ఎక్కువవ్వడంతో ఈ నెలలో ఏసీలు రేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఏసీల రేట్లను 5?8 శాతం మేర కంపెనీలు పెంచిన విషయం తెలిసిందే. కిందటేడాది హ్పమ్ అప్లియెన్స్‌ల రేట్లు రెండు సార్లు పెరిగాయి కూడా. ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు పెరిగిపోయాయని పానాసోనిక్ గౌరవ్ షా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌ను తయారు చేసే కంపెనీలపై భారం పెరుగుతోందని, ఇప్పటి వరకు ఈ భారాన్ని కంపెనీలే భరించుకుంటూ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఏసీల రేట్లు మరోసారి పెరుగుతాయనే సంకేతాలను షా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌ను గమనిస్తున్నామని, ఏసీల రేట్ల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏసీల రేట్లు ఈ నెలలో 4?6 శాతం మేర పెరగొచ్చని హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!