ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక కగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్, జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవలే మోకాలి సర్జరీ అనంతరం ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చేసిన ప్రభాస్.. త్వరలోనే సలార్ ప్రమోషన్స్ షూరు చేయనున్నారు. చాలా కాలం తర్వాత డార్లింగ్ నుంచి వస్తోన్న ఫుల్ మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు దీపావళి సర్ప్రైజ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లుగానే ఈరోజు సలార్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. అంతేకాదు.. ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూనే ప్రభాస్ కొత్త పోస్టర్ సైతం షేర్ చేశారు. డిసెంబర్ 1న రాత్రి 7 గంటల 19 నిమిషాలకు సలార్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఆధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం ఇదే. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా ఏరేంజ్ లో ఉండబోతుందో చెప్పేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ కోసం వెయిట్చేస్తోన్న అభిమానులకు దీపావళి కానుక ఇచ్చేశారు.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక కగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్, జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవలే మోకాలి సర్జరీ అనంతరం ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చేసిన ప్రభాస్.. త్వరలోనే సలార్ ప్రమోషన్స్ షూరు చేయనున్నారు. చాలా కాలం తర్వాత డార్లింగ్ నుంచి వస్తోన్న ఫుల్ మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం,తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కు .. ఉత్తారాదిలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ తిరగరాస్తుందో చూడాలి. సలార్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై కిరంగదూర్ నిర్మిస్తున్నారు.