డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక): రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ’రిపబ్లిక్’ మూవీ రిలీజై కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడితో ఓ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రీలుక్ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు తారక్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. గ్లింప్స్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు గ్లింప్స్‌లో తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థతులు ఎదురయ్యాయి. అసలు ఆ చావుల వెనక ఉన్న మిస్టరీ ఎంటీ అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టాక్. ఈ చిత్రంలో బ్లాక్ మేజిక్ వంటి అంశాలను టచ్ చేశారట. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!