ప్రపంచంలో ఇప్పటి వరకూ మూడు దేశాలు మాత్రమే జీపీఎస్ ఆధారంగా విమానాల ల్యాండిరగ్ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వాటి సరసన భారత్‌కు చేరింది. ఇప్పటి వరకైతే జీపీఎస్ సాయంతో వాహనాలను నడుపుతున్నాం. ఇక, నుంచి విమానాలను కూడా ల్యాండ్ చేయనున్నారు. ఇందుకు ఇస్రో మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా రాజస్థాన్‌లోని విమానాశ్రయంలో పరీక్షించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో త్వరలో అన్ని విమానాలకు దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.దశాబ్దాలుగా వాహనదారులకు నావిగేట్ చేయడంలో ఉపగ్రహాలు సహాయపడుతున్నాయి. తాజాగా, జీపీఎస్ సాయంతో విమానం ల్యాండిరగ్ ట్రయల్ రన్‌ను భారత్ విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో ఆసియా`పసిఫిక్ ప్రాంతంలో జీపీఎస్ సాయంతో రన్‌వేపై విమానం ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. శుక్రవారం అజ్మేర్ విమానాశ్రయం రన్‌వేపై నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమయ్యింది. రన్‌వేపై విమానాన్ని పైలట్లు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆసియా`పసిఫిక్ ప్రాంతంలో ఉప్రగహా ఆధారిత ల్యాండిరగ్ను సురక్షితంగా పూర్తిచేసిన మొదటి దేశం భారత్ అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఓ ప్రకటనలో తెలిపింది.ఈ ట్రయల్స్ భారత పౌరవిమానయాన చరిత్రలో ఎయిర్ నావిగేషన్ సర్వీసుల్లో ఓ మైలురాయి అని పేర్కొంది. ప్రస్తుతం విమానాల ల్యాండిరగ్‌కు సేవలు గ్రౌండ్`బేస్డ్ సిస్టమ్స్ ద్వారా అందుతున్నాయి. ఢల్లీి నుంచి అజ్మేర్ కిషన్‌గఢ్ విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో ఏటీఆర్ విమానానికి కెప్టెన్ సందీప్ సుద్, కెప్టెన్ సతీష్ వీరలు పైలట్లుగా వ్యవహరించారు. కెప్టెన్ శ్వేతా సింగ్, డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్, డీజీసీఏకు చెందిన ఇతర అధికారులు విమానంలో వెళ్లారు.శాటిలైట్ అధారిత నావిగేషన్ వ్యవస్థ ‘గగన్’ విమానం ల్యాండిరగ్ కోసం పైలట్లకు దాదాపు 550 విూటర్ల వరకు రన్‌వే కనిపించేలా సంకేతాలను అందించే గ్రౌండ్`బేస్డ్ ల్యాండిరగ్ సిస్టమ్ మాదిరిగా మరింత ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. అయితే, పిలిచే గ్రౌండ్ బేస్డ్ ల్యాండిరగ్ 200 అడుగుల నిర్ణీత ఎత్తు వరకు ఉంటుంది. పైలట్లు రన్‌వేను గుర్తించకపోతే ల్యాండిరగ్ నిలిపివేయాల్సిన ఎత్తు ఇది. ప్రస్తుత ట్రయల్ ఫ్లైట్ కోసం ఎత్తును 250 అడుగులుగా నిర్ణయించారు. ఇందుకోసం గగన్ ద్వారా ‘లోకలైజర్ పెర్ఫార్మెన్స్ విత్ వర్టికల్ గైడెన్స్ విధానాన్ని పైలట్లు ఉపయోగించారు.గగన్ ఎల్వీపీ ఫ్లైట్ ట్రయల్స్‌లో భాగంగా కిషన్‌గఢ్ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా జీపీఎస్ ల్యాండిరగ్ నిర్వహించాం.. డీజీసీఏ తుది ఆమోదం పొందిన తర్వాత ఈ విధానం వాణిజ్య విమానాల వినియోగానికి అందుబాటులో రానుంది’’ ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. ఖరీదైన గ్రౌండ్`బేస్డ్ ల్యాండిరగ్ వ్యవస్థలు అందుబాటులో లేని చిన్న ప్రాంతీయ విమానాశ్రయాలలో ఎల్వీపీ ద్వారా ల్యాండిరగ్ సాధ్యమవుతుందని ఏఏఐ తెలిపింది. జూలై 1, 2021 తర్వాత దేశంలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలకు వ్యవస్థను అమర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, గో ఫస్ట్,ఎయిర్ ఏషియా వంటి సంస్థలకు చెందిన 76 విమానాల్లో గగన్ వ్యవస్థను అమర్చారు.గగన్ కాకుండా ప్రపంచంలో అమెరికా,యూరప్,జపాన్ వద్ద మాత్రమే ఇటువంటి అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. గగన్ వల్ల ఇంధనం ఆదాతో పాటు గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అవసరం ఉండదని, విమాన భద్రత, ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండిరగ్‌కు అవకాశం ఉంటుంది అని ఇస్రో పేర్కొంది. గత దశాబ్ద కాలంలో మూడు గగన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!