హిందువు అనేది ఒక మతం కాదు. హిందువు అంటే ఒక భూమి.. ఇది కాలక్రమేణా ఒక నాగరికతగా మారింది. రాజకీయ పరిస్థితులు, అధికార గొడవల కారణంగా.. ప్రజలు వక్రీకరిస్తూ వచ్చారు. హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్య భూమిలో ఉన్న వారిని హిందువులుగా పరిగణిస్తారు. ఇక్కడ నివసించిన ప్రజలు సహజంగానే హిందువులుగా మారారు. ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ లేదా హిందువుల భూమి….
జగ్గీ వాసుదేవ్.. ఈ పేరు పెద్దగా అందరికీ తెలియక పోయినప్పటికీ సద్గురు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన అపారమైన మేథో సంపత్తి, ప్రతీ అంశంపై మాట్లాడే తీరుతో ఎంతో మందిని తన ఫాలోవర్లుగా మార్చుకున్నారు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్. ఇక ప్రపంచవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు నిర్వహించే సద్గురు ఎంతో మంది ఔత్సాహికుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సద్గురకు ‘అసలు హిందూ మతం అంటే ఏమిటి.?’ అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సద్గురు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంతకీ సద్దురు దృష్టిలో మతం అంటే ఏంటి.? హిందూ మతం గురించి సద్గురు అభిప్రాయం ఏంటో.? వారి మాటల్లోనే….
హిందువు అనేది ఒక మతం కాదు. హిందువు అంటే ఒక భూమి.. ఇది కాలక్రమేణా ఒక నాగరికతగా మారింది. రాజకీయ పరిస్థితులు, అధికార గొడవల కారణంగా.. ప్రజలు వక్రీకరిస్తూ వచ్చారు. హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్య భూమిలో ఉన్న వారిని హిందువులుగా పరిగణిస్తారు. ఇక్కడ నివసించిన ప్రజలు సహజంగానే హిందువులుగా మారారు. ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ లేదా హిందువుల భూమి అని పిలుస్తారు. నిజానికి నాగరికత అనేది ఒకే నమ్మకం. నాగరికత అనేది నిర్భయ, అపరాధం లేని మానవుల పరిణామం. ప్రస్తుత మానవ మేధస్సు, వందల ఏళ్ల క్రితం నాటి కంటే కచ్చితంగా చాలా మెరుగ్గా ఉంది. దీనికి కారణం.. తమ జీవితాన్ని సక్రమంగా నిర్వహించాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నా జీవితం నా కర్మ అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
హిందువు అనేది ఒక మంత, లేదా ఒక నిర్ధిష్ట జీవన విధానం కాదు. హిందువు అంటే ఒక భూమి. భూమి కారణంగా ప్రజలు హిందువులుగా మారారు. ప్రజల వల్లే నాగరికత హిందువైంది. నాగరికత కారణంగానే దేశం హిందూస్థాన్గా మారింది. తెలియని భయాలు, అపరాధం, దురాశ నుంచి బయటకు వస్తే మీరూ హిందువు అవుతారు. హిందువులు ఒక నిర్ధిష్ట రకం వ్యక్తులు కాదు. దానిని సనాతన ధర్మం అంటారు. సనాతన అంటే శాశ్వతం అని అర్థం. ధర్మం అంటే మతం కాదు, ధర్మం అంటే చట్టం. కాబట్టి శాశ్వతమైన చట్టం అంటే ఏంటి.? ఇక్కడ కూర్చున్నప్పుడు మనమందరం భిన్నంగా ఉన్నాము, కానీ చివరికి ప్రతి ఒక్కరూ తిరిగి మట్టిలోకి వెళ్లాల్సిందే. అది కాల్చినా లేదా పాతి పెట్టినా.
సనాతన ధర్మానికి ఉన్న బలం..
గడిచిన వెయ్యేళ్లలో ప్రజలు ఎన్నో దారుణాలను చూశారు. ఆక్రమణదారులు ఎన్నో అఘాయిత్యాలకు ఒడిగట్టార. మత గురువులను చంపేశారు, వేలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. కానీ సనాతన ధర్మం అందరి హృదయాల్లోనూ, మనసుల్లోనూ ఉంది కాబట్టి దానిని చంపలేక పోయారు. తెలుసుకోవాలనే సహజమైన కోరికను ఎవరూ చంపలేరు. భయం, దురాశ, అపరాధం నుంచి విముక్తి పొందితే.. ఈ జీవితం సహజంగా తన శాశ్వతమైన స్వభావాన్ని కోరుకుంటుంది. ఎవరైనా వ్యవస్థను నాశనం చేయొచ్చు, కానీ వ్యవస్థీకత, ఉద్దేశపూర్వ భావజాలాన్ని నాశనం చేయలేరు.
ప్రపంచంలో ఉన్న ప్రజలను భయం, అపరాధం, దురాశల నుంచి విముక్తి చేసే దిశలో నడిపిస్తే సనాతన ధర్మం అంతటా చిగురించడాన్ని మనం గమనించవచ్చు. సనాతన ధర్మం అంటే అందరూ మంత్రం పఠించడమో, పూజ చేయడమో కాదు. ప్రజలు వారి అంతిమ అవకాశాన్ని వెతుకున్నంత కాలం, వారిని సనాతని అని పిలుస్తాము. ఎందుకంటే సనాతన అంటే ఇక నిర్ధిష్టమైన సమూహం కాదు. సనాతన అంటే శాశ్వత స్వభావం. కాబట్టి హిందూమతం అనేది లేదు, ఇజం కూడా లేదు. అయితే దురదృష్టవశాత్తు, మనుషులు తమ మనుగడ ప్రయోజనాల కోసం ఇజంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
చాలా మంది నేను హిందువుని కాదని అనుకుంటారు కానీ ఈ భూమిలో పుట్టాను కాబట్టి, భౌగిళిక పరంగా నేను హిందువునే. ప్రతీ మనిషి వారి అంతిమ స్వభావం కోసం వెతకాలను నేను కోరుకుంటాను. అప్పుడు అందరూ సనాతనిలే అవుతారు. కానీ వారు మతం మారుతున్నారని అనుకోకండి. ఎందుకంటే అసలు మారడానికి ఏమీ లేదు. భావజాలం లేదు, తత్వశాస్త్రం లేదు, దేవుడు లేడు.. మీ దృష్టి అభివ్యక్తి నుంచి దాని మూలానికి మారినప్పుడు మీరు సనాతని అని అర్థం అని సద్గురు చెప్పుకొచ్చారు.