నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫిమేల్ లీడ్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ’శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మూడో షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్, అరకు లొకేషన్స్‌లో ఈ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ముఖ్య నటులపై కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట షూట్ చేశారు.
నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతోంది మూవీటీమ్. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు. నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ’నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి శబరి పాత్రను చేస్తే బాగుంటుందని భావించి వరలక్ష్మిని తీసుకున్నాం. ఇందులో ఆమె స్వతంత్ర భావాలున్న యువతిగా కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చాలా ఎఫెక్టివ్‌గా పెర్ఫార్మ్ చేశారు’ అని చెప్పాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!