కాలేజీకి గర్వకారణం సెక్రటరీ అండ్ కస్పాండెంట్ నిశాంత్ వర్మ
భీమవరం ఫిబ్రవరి 15:( ఆంధ్ర పత్రిక ) స్థానిక ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమినిటీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నల్ల వీర్రాజుకు కృష్ణ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ లో పిహెచ్డి ప్రదానం చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం జగపతి రాజు చెప్పారు .ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్ఆర్కె నిశాంత్ వర్మ వీర్రాజును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ విజయవాడ సిద్ధార్థ కళాశాలకు చెందిన డాక్టర్ వి లక్ష్మీ ప్రసన్న, భీమవరం విష్ణు కళాశాలకు చెందిన డాక్టర్ ఆర్ ఎల్ ఎన్ ప్రదీప్ కుమార్ ల పర్యవేక్షణలో సమ్ మెథడ్స్ ఫర్ సాల్వింగ్ లినియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజ్జి ఎన్విరాన్మెంట్ యూజింగ్ జియో మెట్రిక్ మీన్ ర్యాంకింగ్ టెక్నిక్యూస్. అనే అంశంపై చేసిన పరిశోధనకు కృష్ణ యూనివర్సిటీ పీహెచ్డీ ప్రధానం చేసిందని ఆయన వివరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం జగపతి రాజు మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో అధ్యాపకుల సైతం ఎప్పటికప్పుడు తమ ప్రతిభను నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు యువధ్యాపకులందరూ త్వరితగతని పీహెచ్డీలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వీ రంగరాజు మ్యాథమెటిక్స్ అండ్ హ్యూమన్టీస్ హెడ్ డాక్టర్ డి. వెంకటపతి రాజు తదితరులు డాక్టర్ వీర్రాజు అన్నదించారు.