andhrapatrika ; ఉభయ తెలుగు రాష్టాల్ల్రో రాజకీయ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారుతోంది. విపక్షాలను అణచి వేయడం అన్న ఏకైక సూత్రం ఆధారంగా రాజకీయాలను నెరపుతున్నారు. అధికారంలో ఉన్న వైసిపి, బిఆర్‌ఎస్‌లు సమస్యల మూలాలను గుర్తించే బదులు ఎదురుదాడి రాజకీయాలను చేస్తున్నారు. దీంతో నష్టపోయేది తామే అన్న విషయాన్ని గుర్తించడం లేదు. మండలి ఎన్నికల్లో ఎపిలో టిడిపి ఆధిక్యత చాటింది. నాలుగు సీట్లను గెల్చుకుని అధికార వైసిపికి సవాల్ విసిరింది. దీనివల్ల ఇప్పటికిప్పుడు వైసిపికి వచ్చిన నష్టం లేకపోవచ్చు. కానీ ప్రజల్లో టిడిపికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తించి మసలుకుంటే మంచిది. ప్రజల్లో వివిధ అంశాలు కావచ్చు..సమస్యలపై అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. కానీ వీటిని అధికారంలో ఉన్న పార్టీలు గుర్తించడం లేదు. రాజకీయాల్లో ఎదురుదాడి, విమర్శలను ఎల్లవేళలా ట్రంప్ కార్డుగా వాడలేం. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి..వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తేనే ప్రజలు చేరువ అవుతారు. విశ్వాసం పెంచుకుంటారు. అంతే తప్ప విపక్షాలను ఎంత సమర్థంగా దూషించినా అది పనిచేయదు. ఇకపోతే తెలంగాణలో కూడా అధికార బిఆర్ఎస్ కోరి సమస్యలు సృష్టించు కుంటోంది. అనవసర కయ్యాలకు కాలుదువ్వుతోంది. ఎమ్మెల్సీ కవిత విషయంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దాని నుంచి బయటపడే మార్గాలను వెతక్కుండా కేంద్రాన్ని నిందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం మాత్రం పొందలేమని గుర్తించడం లేదు. కవితకు తెలంగాణకు ముడిపెట్టడం కూడా మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. కవిత తెలంగాణకు ప్రతినిధి కాదని గుర్తించాలి. నిజానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలలో అనేక రకాలైన అసంతృప్తులు ఉన్నా, వాటిని ప్రత్యామ్నాయంగా మలిచి పోరాడే రాజకీయ శక్తి ఏ ప్రతిపక్షానికీ లేదనే చెప్పాలి. అందుకే ఇంతకాలం ఇరు తెలుగు రాష్టాల్ల్రో అధికారపక్షానికి ఎదురులేనట్టే కనిపించింది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని రుజువువుతోంది. రాజకీయాలు మలుపు తిరిగి ప్రభుత్వమే తనంతట తాను ఉచ్చు బిగించుకుంటోంది. తెలంగాణ,ఎపిల్లో సమస్యలు వేరైనా రాజకీయంగా రెండు అధికార పార్టీలు అవినీతి ఊబిలో కూరుకుపోతున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌లో నిందారోపణలు ఎదుర్కోవడం ప్రజల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. విచారణ తతంగం కూడా ఉత్కంఠభరిత రాజకీయాలకు దారతీస్తోంది. సమస్య నుంచి బయటపడే బదులు అధికార బిజెపిపై ఎదురు దాడికి దిగడం ద్వారా బిఆర్ఎస్ నేతలు ప్రజల్లో చులకన అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పపర్ల లీకేజీ వ్యవహారం రాజుకుంది. దీనిపైనా మంత్రి కెటిఆర్ ఎదురు దాడికి దిగి ప్రభుత్వం తప్పు లేదన్న ధోరణిలో మాట్లాడడం పలాయనవాదం తప్ప మరోటి కాదు. ఇది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడివున్న వ్యవహారం. ఏదో రాష్ట్రంలో..ఎక్కడో కూడా ఇలాగే పేపర్లు లీక్ అయ్యాయని, గుజరాత్‌లోనూ లీక్ అయ్యాయని చెప్పడం ద్వారా అధికార నేతలు అసమర్థతను బయట పెట్టుకుంటున్నారు. ప్రభుత్వపక్షం గానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా సమస్యను ఎదుర్కొనడంలో సమర్థత, సమయస్ఫూర్తి వ్యక్తం చేయడంలేదు. పైగా, ప్రభుత్వం కలవరపడుతున్నది. ఎదురవుతున్న సవాళ్లకు, విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. దీంతో ఏం చేయాలో తోచక విపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడం..వారే పేపర్ లీకేజీకి బాధ్యులన్న లెవల్లో ప్రచారం చేసుకోవడం ద్వారా తమ అసమర్థతను మరింతగా నిరూపించుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రజలంతా చైతన్యంగా ఆలోచిస్తారు. సమస్యల ఏమిటి..ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతున్నాయని గమనిస్తారు. పరీక్షా పత్రాల లీకేజీ అన్నది అన్నింటిని మించిన సంక్షోభం. పరీక్షలు రాసి, ఎంపికయిన వారితో పాటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సమస్య మాత్రమే కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నమోదయిన లక్షలాది ఉద్యోగార్థుల సమస్య ఇది. లక్షలమందిలో అగ్గి రాజేసిన సమస్య ఇలా లక్షలమంది వెనుక ఉన్న కుటుంబా లతో పాటు..వారిని కలుపుకుని లక్షల మంది కూడా తీవ్రంగా పరిశీలిస్తున్న సమస్యగా గుర్తించాలి. ఈ అంశం రాజకీయ అస్త్రంగా పదునెక్కుతున్నది. ప్రభుత్వాన్ని బోనులో నిలదీస్తు న్నారు. కమిషన్ వ్యవహారంగా చూపుతూ.. ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పడం ద్వారా బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు. సమస్యకు బాధ్యత వహించేది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీయే అని ప్రజలు నమ్ముతున్నారు. అలా కాదని రేవంత్‌ను, బండి సంజయ్‌లను సిట్ ముందుకు రప్పించి చేసే తతంగం సమస్యలను తప్పించు కోవడానికి చేసే యత్నంగానే చూస్తారు. కవిత ఈడీ సమస్యకు ఇస్తున్న ప్రాధాన్యం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమస్యకు అధికార పార్టీ ఇవ్వడం లేదు. ఇది గూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. అందుకే తెలంగాణలో పరీక్షాపత్రాల లీక్ , కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం ప్రతిపక్షాలకు దొరికిన ఆయుధంగా చూడాలి. అధికార పార్టీపైన, కుటుంబ పాలనపైనా విమర్శలకు దిగుతున్న విపక్షాలు తమ గొంతును పెంచుతున్నారు. బిఆర్ఎస్కు సాటి లేదన్న తీరులో సాగుతున్న సమయంలో ఈ రెండు అంశాలు ప్రధానంగా ప్రజల్లో నానుతున్నాయి. ఎపిలో కూడా మండలి ఫలితాలు టిడిపికి బూస్ట్ ఇచ్చాయి. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని ఏదో అవినీతి కేసును అంటగట్టినంత మాత్రాన జగన్ తనకున్న మచ్చ నుంచి ప్రజల దృష్టిని మరల్చలేరు. ఇప్పటికే అనేక సమస్యలపై పోరాడుతున్నారు. అమరావతి రాజధాని మొదలు పోలవరం, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, చెత్తపన్ను, ఉద్యోగుల ఆందోళన, ఆందోళనలను అణచివేసే జీవో నంబర్ వన్ తదితరాలన్నీ కూడా అధికార వైసిపికి చుట్టుకుంటున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో రెండు రాష్టాల్ల్రో టిడిపి,కాంగ్రెస్, బిజెపిలు పోటాపోటీగా ఉద్యమకార్యాచరణ చేపడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, క్షేత్రస్థాయిలో విపరీతంగా ఉన్న అవినీతి, ధరణిని ఆశ్రయించి చెలరేగుతున్న రాజకీయ కబ్జాదారుల దౌర్జన్యాలు బిఆర్ఎస్కు పరీక్ష పెడుతున్నాయి. కేందప్రభుత్వం కక్షసాధింపుతో ఉన్నదన్న కారణంగా రాష్ట్ర సమస్యల నుంచి బిఆర్ఎస్ తప్పించుకోలేదు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!