మచిలీపట్నం నవంబర్ 25 ఆంధ్రపత్రిక :
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ఎల్లవేళలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తో ఉండాలని ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఏ రాజారెడ్డి అన్నారు.
శనివారం మచిలీపట్నం ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏ . రాజారెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను, ప్రభుత్వంలో విలీనం చేయడం మొదటి వరం అని ఆర్టీసీ ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ స్కీమును కల్పించడం రెండవ వరం అని ఇలాంటి వరాలు కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగులు సదా తమ హృదయంలో నిలుపుకుంటారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగా ఉద్యోగులకు గ్యారెంటీ భరోసా అయినటువంటి జిపిఎస్ ప్రయోజనం కల్పించడం హర్షనీయమని ఏ రాజారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల తరఫున జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగి పదవీ విరమణ తర్వాత మూల వేతనంలో 20% పెన్షన్ లభించేదని దీనిని 33% పెంచాలని అధికారులు కోరగా 40% పెంచాలని మంత్రుల కమిటీ సిఫార్సు చేయగా ఉద్యోగుల పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి , జిపిఎస్ ప్రవేశపెట్టి ఉద్యోగి పదవీ విరమణ చేసిన నెలలో ఉన్న మూలవేతనంపై 50% పెన్షన్ చెల్లించాలని సంవత్సరానికి రెండు డి ఆర్ లు , ఇవ్వాలని నిర్ణయించడం సముచితమైన నిర్ణయం అని హర్షం వ్యక్తం చేశారు.ఈ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి కనీస పెన్షన్ 25 వేల నుండి 50 వేల వరకు లభిస్తుంది అని హామీ ఇచ్చారు. ప్రజా రవాణా ఉద్యోగులకు జిపిఎస్ ద్వారా మెరుగైన పెన్షన్ సౌకర్యం కల్పించినందుకు పి.టి.డి. ఉద్యోగులందరూ ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఏ. రాజారెడ్డి అన్నారు. ప్రజా రవాణా ఉద్యోగుల జీతభత్యాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,988 కోట్లు కేటాయించి ఏ ముఖ్యమంత్రి అందించని సహకారం అందించి ఉద్యోగుల పక్షపాతి గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సామాన్య ప్రయాణికులు కూడా విలాసవంతమైన సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం అనుభవించాలనే ఉద్దేశ్యం తో డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు.
ఆర్టీసీ సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల భార్య/పిల్లలకు ఆర్టీసీ సంస్థలో ఖాళీలు లేకపోవడం వల్ల ప్రభుత్వంలోని విభాగాలలో, సచివాలయం నందు కారుణ్య నియామకాలు కల్పించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. జగన్ ప్రభుత్వం 2016 నుండి 2019 వరకు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా పూర్తి చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో ప్రజా రవాణా విభాగం భారతదేశంలోనే అగ్రస్థానంలోకి చేరుకొంటుందనడంలో ఏ విధమైన సందేహం లేదన్నారు.
2024వ సంవత్సరంలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తొలి విడత , మినీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మహిళల ఓట్లకు గాలం వేయడానికి ఆర్టిసి బస్సుల్లో జిల్లా పరిధిలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆర్టీసీ అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాగైనా ఆర్టీసీని సమాధి చేయాలనే కక్షతో తన జీవితాశయం నెరవేరలేదని చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో 2024 నందు ఆర్టిసి బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇవ్వడం జరిగిందని, ఇది సాధ్యం కాని హామీ అని అన్నారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్రజా రవాణా వ్యవస్థ ఉచిత ప్రయాణ హామీలతో ఆర్టీసీ ప్రగతి చక్రం తిరిగి తిరోగమనంలోకి వెళ్లే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
పి.టి.డి. ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ఎస్బిఐ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద 45 లక్షల రూపాయల నుండి కోటి పది లక్షల రూపాయలకు పెంపు చేయడం జరిగిందని ఆర్టీసీ ఉద్యోగులందర్నీ తన కుటుంబ సభ్యులుగా భావించి సమస్యలు పరిష్కారం కొరకు నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కి,మరియు ఎంప్లాయిస్ యూనియన్ కి, గుర్తింపు కల్పించినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కి తాను ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతానని తెలియజేశారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి ప్రతినెల అధికారులు, ఉద్యోగులతో సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని అన్నారు. కార్గో ఆదాయం పెంచుటకు కమిటీని నియమించామని, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో పర్యటించి కార్గో ఆదాయం పెంచుటకు అధ్యయనం చేసి రిపోర్టును పిటిడి కమిషనర్ కి అందజేస్తారని బోర్డు డైరెక్టర్ గా తాను కూడా డిపోల పర్యటనలో పాలుపంచుకుంటానని తెలియజేశారు.
జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నందున కార్గో ఆదాయం పెరుగుటకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఆదాయం పెంచుటకు అధికారులు, ఉద్యోగులు సమిష్టి కృషి చేయాలని ఆర్టీసీ బోర్డ్ డైరెక్టర్ రాజారెడ్డి కోరడం జరిగింది. మిగతా ఉద్యోగుల కన్నా ఆర్టీసీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారని ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు.
పి. టి .డి. ప్రభుత్వ ఉద్యోగులుగా నిరసనలు, ధర్నాలకు దూరంగా ఉండి నిబద్ధతతో విధులు నిర్వహించి సంస్థ పురోగతికి భాగస్వాములు కావాలని , తద్వారా సంస్థ పై ప్రభుత్వానికి నమ్మకం కలిగి ఉద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ మన్ననలు పొందే విధంగా సంస్థ ఉద్యోగులు ఎల్లవేళలా కృషి చేయాలని ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ రాజారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి ఏ వాణిశ్రీ, కె.వి రమణ , ఈ. సురేష్ బాబు, మోషే, బందర్ డిపో మేనేజర్ టీ. పెద్దిరాజు, ఏ రాజశేఖర్, గుడివాడ డిపో మేనేజర్ జి. రాజేష్ ఉయ్యూరు డిపో మేనేజర్ కే ఎస్ ఆర్కే ప్రసాద్, అవనిగడ్డ డిపో మేనేజర్ కే. హనుమంతరావు గన్నవరం డిపో మేనేజర్ కే. శివాజీ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.