’ఆర్ఆర్ఆర్’ జైత్రయాత్ర జపాన్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ట్రిపుల్ఆర్ సినిమాకు జపాన్‌లో ఆధరణ పెరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా నెల రోజులు ఆడిరదంటే అది గొప్ప విషయం. అలాంటిది ఆర్ఆర్ఆర్ వంద రోజులను దాటేసింది. అది కూడా మూడు వేల ఏడు వందల మైల్స్ దూరంలో ఉన్న జపాన్‌లో. మన సినిమా పక్క దేశంలో వంద రోజులు ఆడిరదంటే అది చిన్న విషయం కాదు. గతేడాది అక్టోబర్ 21న భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలివారంలోనే రూ.4 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. ఫస్ట్ వీక్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా 24ఏళ్లుగా రజనీకాంత్ ముత్తు(24.14 కోట్లు) పేరిట ఉన్న రికార్డును నాలుగు వారాల్లోనే బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇటీవలే 114 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుని అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ మరో రేర్ ఫీట్‌ను సాధించింది. ట్రిపుల్ఆర్ తొలిరోజు కలెక్షన్లను పోల్చితే 105వ రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడిరచారు. అంతేకాకుండా ఇప్పటి వరకు జపాన్‌లో ఈ సినిమాను 5,13,787 మంది వీక్షించినట్లు తెలిపారు. ఆస్కార్ బరిలో చోటు దక్కించుకున్నాక ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. బిగ్ స్క్రీన్‌లో సినిమా చూడడానికి జపాన్ ప్రేక్షకులు థియేటర్లకు ఎగపడుతున్నారు. ఇటీవలే జపాన్‌లో డాల్బీ విజన్ స్పెషల్ ప్రింట్‌ను అప్‌గ్రేడ్ చేశారు. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుండి వసూళ్ల పరంపర కొనసాగించింది. ’బాహుబలి`2’ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ’ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు సృష్టించింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!