వారాంతంలో లాభాల వద్ద ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ప్రారంభంలోనే శుభారంభం పలికాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 954.15 పాయింట్ల భారీ లాభంతో 68435.34 వద్ద, నిఫ్టీ 334.10 పాయింట్ల లాభంతో 20602.00 వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా భారీగా దూసుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతి ఎయిర్టెల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు ఉన్నాయి. బ్రిటానియా, నెస్లే, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అపోలో హాస్పిటల్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ వంటి కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ;లాభాల్లో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.