లండన్,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): భారత సంతతికి చెందిన రిషిసునాక్ (42) బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఆయనను ప్రధానిగా బ్రిటన్ రాజు చార్లెస్ `3 నియమించినట్లు ప్యాలెస్ ప్రకటించింది. ఈ మేరకు సునాక్ ఛార్లెస్‌ను కలిసారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ ప్రధాని రేసు నుండి వైదొలగడం, పెన్నీ మోర్డాంట్‌కు తగినంత మద్దతు లభించకపోవడంతో రిషికి మార్గం సుగమమైంది. ప్రధానిగా తనకు మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని చార్లెస్ `3 ని రిషి కోరినట్లు సమాచారం.లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్`3ని కలిశారు. లిజ్ ట్రస్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడం, రిషి సునాక్‌ను ప్రధాని బాధ్యతలు స్వీకరించడం అంతా నిమిషాల్లో జరిగిపోయాయి. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు తన వంతు కృషి చేస్తానని, బ్రిటన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అద్భుతాలు సాధించగలమని అన్నారు. అంతకుముందు చార్లెస్ `3 కి లిజ్ ట్రస్ తన రాజీనామాను సమర్పించారు. 200 ఏళ్లలో బ్రిటన్ అత్యున్నత పదవిని చేపట్టిన పిన్న వయస్కుడిగా రిషి సునాక్ రికార్డు సృష్టించాడు . మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ రాజీనామా చేయడంతో ఈ ఏడాదిలోనే రిషిసునాక్ బ్రిటన్ మూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం పార్లమెంటులో మొదటి సెషన్‌ను ఎదుర్కోనున్నారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ తొలి ప్రసంగం చేశారు. రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుల సమస్య పరిష్కారాన్ని రానున్న తరాలకు వదిలేయబోనన్నారు. లిజ్ ట్రస్ ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేయడానికే తాను ప్రధాని అయినట్లు రిషి సునాక్ చెప్పారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టకాలంలో ఉందని అయితే అతి త్వరలోనే మళ్లీ కోలుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు బ్రిటన్ పౌరులపై నమ్మకముందని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో తాను బ్రిటన్ ప్రధానిగా ఉండటం తనకు గౌరవనీయమని విషయమని లిజ్ ట్రస్ చెప్పుకున్నారు. పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోందని, అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలని సూచించారు. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలని ఆమె సలహాఇచ్చారు. ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక లిజ్ ట్రస్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్యే పోటీ జరిగింది. చివరకు లిజ్ ట్రస్ విజేతగా నిలిచారు. కానీ ఆమె తీసుకు వచ్చిన మధ్యంతర బడ్జెట్ బ్రిటీష్ ఆర్ధిక వ్యవస్థను మరింత అస్తవ్యస్తం చేసింది. లిజ్ ట్రస్ ఆర్ధిక విధానాలతో బ్రిటన్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో అధికారం చేపట్టిన 45 రోజులకే ఆమె యూ టర్న్ తీసుకున్నారు. ప్రధానిగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. వెయిటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన రిషి సునాక్ బ్రిటన్ చరిత్రలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!