అమరావతి,నవంబర్ 3 (ఆంధ్రపత్రిక): ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బ తినేలా యెల్లో మీడి యా వ్యతిరేక రాతలు రాస్తోందని, కానీ, వాస్తవాన్ని వివరించి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులకు సూచించారు.గురువారం విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
విప్లవాత్మక సంస్కరణలు
నాణ్యమైన విద్యకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్ ఇస్తున్నాం. ఇందులో భాగంగా స్కూల్ బ్యాగు, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటున్నాయి. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్ ప్రారంభించే తొలిరోజే అంది స్తున్నాం. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో స్కూల్ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్య పుస్తకాలు ఇవ్వని పరిస్థితి. మనం ఆ విధానంలో మార్పు తెచ్చాం. మనం స్కూల్ ప్రారంభించిన తొలిరోజు పాఠ్యపుస్తకాలు ఇతర మెటీరియల్ అందిస్తున్నాం, ఇది గతానికి ఇప్పటికీ ఉన్న పెద్ద తేడా అని వివరించారు.
తప్పుడు రాతలతో..
ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాతలు రాస్తోందని అధికారులు ఈ సందర్భంగా.. సీఎం జగన్‌కు వివరించారు. సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అయినా.. ఇంకా పుస్తకాలు అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను అధికారులు ఖండిరచారు. డిసెంబరులో సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అవుతుందని, అలాంటిది ఇప్పుడే పుస్తకాలు అందలేదని రాయ డం కచ్చితంగా తప్పుదోవ పట్టించడమేనని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్లో రెండో సెమిస్టర్ ప్రా రంభం అవుతుందన్న విషయాన్ని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నామని, ఈ విషయం తెలిసీ విద్యా ర్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాశారన్నారు.
జగన్‌కు వాళ్లు వ్యతిరేకం కాబట్టే..
వాస్తవాలను ఇలా వక్రీకరించడంతో పాటు… ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లలనైతిక స్థైర్యం దెబ్బతినేలా ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక వార్తలు రాస్తున్నారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లిషు మీడియంకు, ప్రభుత్వ విద్యారంగానికి వారు వ్యతిరేకం కాబట్టే.. ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేస్తున్నారన్నారాయన. ‘’పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య అందడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంకా మొదలు కాక ముందే రెండో సెమిస్టర్ ప్రారంభం అయిందని వార్తలు రాయడంలో ఉద్దేశం ఇదే. డిసెంబరులో సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అవుతుందని అకడమిక్ క్యాలెండర్లో ఉంటే… ఆ విషయం రాయలేదు. రాజకీయంగా జగన్‌ను ఇబ్బందిపెట్టాలి కాబట్టే, ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారిలో స్థైర్యం దెబ్బతినేలా నిరంతరం కథనాలు రాస్తున్నారు.రామోజీరావుకు, ఈనాడుకు జగన్మోహన్రెడ్డి అంటే ఇష్టం లేదు.. అంత మాత్రాన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం తప్పు. ఇలా తప్పుడు వార్తలు రాయకూడదు. మన ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వచ్చాం. పుస్తకాల్లో జోడిరచిన అదనపు సమాచారం వల్ల, బైలింగువల్ కాన్సెప్ట్ వల్ల టెక్ట్స్‌బుక్ సైజు పెరిగింది. బైలింగువల్ టెక్ట్‌బుక్స్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషు ఉంటుంది.. దీంతో సాధారణంగానే టెక్ట్స్‌బుక్ సైజు పెరుగుతుంది. దీంతో టెక్ట్స్ బుక్‌ను సెమిస్టర్ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. దీన్ని వక్రీకరించి, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు వార్తలు రాస్తున్నారు.
పటిష్టంగా సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్
గతంలో క్లాస్ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘’గతంలో పాఠ్యాంశాలు అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్ బోధించే పరిస్థితి లేదు. అందుకే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చాం’’ అని పేర్కొన్నారు. మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ సమర్ధవంతగా అమలు చేయాలి. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!