నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): ప్రముఖ వ్యాపార వేత్త కుమారుడితో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ కొంత కాలంగా ప్రేమలో ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలు, డిన్నర్లు, విదేశీ టూర్లకు ఇద్దరూ కలిసి వెళ్లిన ఫొటోలు సైతం ఇటీవల నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై తాజాగా నటి స్పందించింది. ’మిలీ’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తన మిత్రుడు ఒర్హాన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అతనితో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని తెలిపింది.
ఒర్హాన్ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. మంచి స్నేహితుడు. అతనితో ఉంటే నేను ప్రతిక్షణం సంతోషంగానే ఉంటా. అన్ని విషయాల్లో నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచాడు. నేను అతన్ని చాలా నమ్మాను. అతను నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుంది. అతను నాకు ఓ గొప్ప వ్యక్తిఅంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ’మిలీ’. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడిరది అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో జాన్వీ మిలీ నౌదియల్గా కనిపించింది. మలయాళ చిత్రం ’హెలెన్’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. సన్నీ కౌశల్, మనోజ్ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ ఈ సినిమాకు దర్శకుడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!