తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే వేళాయింది. ప్రమాణస్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానం పలుకుతున్నారు రేవంత్. అయితే కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి చోటు ? అనే చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119. సభ్యుల సంఖ్యలో 15 శాతం మించి కేబినెట్ ఉండకూడదు. ఈ లెక్క ప్రకారం 18మందితో కొత్త కేబినెట్ కొలువుదీరే చాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పార్టీ ఛాయిస్. స్పీకర్ డిప్యూటీ స్పీకర్, చీప్ విప్, ఇద్దరు విప్‌లకు కలుపుకుంటే
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే వేళాయింది. ప్రమాణస్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానం పలుకుతున్నారు రేవంత్. అయితే కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి చోటు ? అనే చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119. సభ్యుల సంఖ్యలో 15 శాతం మించి కేబినెట్ ఉండకూడదు. ఈ లెక్క ప్రకారం 18మందితో కొత్త కేబినెట్ కొలువుదీరే చాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పార్టీ ఛాయిస్. స్పీకర్ డిప్యూటీ స్పీకర్, చీప్ విప్, ఇద్దరు విప్‌లకు కలుపుకుంటే మొత్తం 23 పోస్టులు. వాటి కోసం 32 మంది మధ్య ప్రధానంగా పోటీ వున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో జరిగిన డిస్కషన్స్ ప్రకారం మల్లు భట్టి విక్రమార్క్, పొన్నం ప్రభాకర్‌లకు డిప్యూటీ సీఎం ఇస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవి కట్టబెట్టి, ఆయన సతీమణికి పద్మావతిని కేబినెట్‌లోకి తీసుకుంటారా? అన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇక కోమటి రెడ్డి బ్రదర్స్ డిమాండ్ ఏంటీ? ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్‌కు ఘన విజయం అందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతుందన్నదీ ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఖాయమనే చర్చ ఉండనే ఉంది. మరి ఆమెతో పాటు కొండా సురేఖ సైతం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక దిగ్గజాలను ఓడించిన యువ నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటారా? యశస్వినిఅలాంటి వారికి మంత్రి మండలిలో స్థానం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.
సీనియర్లు – యువనాయకత్వం బ్యాలెన్స్ చేస్తారా? జిల్లాల వారీగా నేతల సీనియార్టీతో పాటు సామాజిక సమీకరణకు ప్రాముఖ్యత ఇచ్చేలా సమాలోచలను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓడిపోయినా సరే జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది మరో అంశం. అలాగే విజయశాంతి పేరు పరిశీలనలో ఉందనే టాక్ విన్పిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్‌లో కేబినెట్ బెర్త్ దక్కేది ఎవరికనే చర్చ జరుగుతోంది. తనకు కేబినెట్‌లో చోటు కల్పించాలని ఏకంగా హైకమాండ్‌కు తన మనసులో మాటను చెప్పారు గడ్డం వినోద్.
ఇదిలావుంటే మిత్రపక్షం సీపీఐ రేవంత్‌రెడ్డితో ఎల్లా హోటల్‌లో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా తమకు రావాల్సిన రెండు MLCలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. కేబినెట్‌లోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తామన్నారు సీపీఐ సీనియర్ నేత నారాయణ.. కమ్యూనిస్ట్‌ల గొంతు అసెంబ్లీలో వినిపిస్తామన్నారు కూనంనేని.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. వరెవరు ప్రమాణం చేయాలన్న దానిపై కూడా కసరత్తు జరుగుతోంది. ముందుగా కీలక నేతలతో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది పార్టీ నాయకత్వం. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ సర్కారులో ఎవరెవరు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నారు.. వాళ్లకు ఏ శాఖలు ఇవ్వనున్నారన్నది ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తోంది. కాగా.. సామాజిక వర్గాల వారిగా మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కించుకునే నేతలు వీళ్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక సామాజిక వర్గాల వారీ చూస్తే..
SC నుంచి అవకాశం..
1. మల్లు భట్టవిక్రమార్క 2. గడ్డం వివేక్ (లేదా) వినోద్ 3. దామోదర రాజనరసింహ 4. వంశీ కృష్ణ 5. అద్దంకి దయాకర్ (ఎమ్మెల్సీ కోటా)
బీసీ నుంచి అవకాశం
1. పొన్నం ప్రభాకర్ (గౌడ్) 2. శ్రీ హరి (ముదిరాజ్) 3. భీర్ల ఐలయ్య ( యాదవ్) 4. అది శ్రీనివాస్ (మున్నూరు కాపు) 5. కొండ సురేఖ (పద్మశాలి) 6. ఈర్లపల్లి శంకర్ (చాకలి)
ST సామాజిక వర్గం నుంచి..
1. సీతక్క (అనసూయ)
కమ్మ :
1. తుమ్మల నాగేశ్వర రావు
వెలమ :
1. ప్రేమ్ సాగర్ రావు 2. జూపల్లి కృష్ణ రావు 3. గండ్ర సత్యనారాయణ
అటు రేవంత్‌ను సీఎల్పీ లీడర్‌గా డిక్లేర్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్లు స్వాగతించారు. ప్రజాస్వామిక పద్ధతిలో కాంగ్రెస్ ఒక ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. అందరూ హైకమాండ్ మాటే శిరోధార్యం అంటున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి , శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సహా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్‌తో తమ మనసులో మాట చెప్పారు. మరి హైకమాండ్ నుంచి వాళ్లకు ఎలాంటి భరోసా వచ్చింది. ఇప్పటి వరకు అంతా హైకమాండ్ మాటే తమ బాట అంటున్నారు. మరి కేబినెట్ కూర్పులో కూడా ఐక్యతారాగం కొనసాగుతుందా?. రేవంత్ డ్రీమ్ కేబినెట్‌లో ఎవరికి చోటు అనేది ఆసక్తికరంగా మారింది.