హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 78 కిలోల కేక్‌ను కాంగ్రెస్ నేతలు కట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలకు తినిపించారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 78 కిలోల కేక్‌ను కాంగ్రెస్ నేతలు కట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వీహెచ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా జన్మదినం రోజునే తెలంగాణ ప్రకటన వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన నిజమైన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని.. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.