తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీల కుల గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. బీసీల కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. అలాగే కుల గణన కోసం బీసీ సంఘాలు చేపట్టిన నిరసన, ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీల కుల గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. బీసీల కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. అలాగే కుల గణన కోసం బీసీ సంఘాలు చేపట్టిన నిరసన, ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించిన సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసినా కూడా బిహార్ రాష్ట్రంలోజేడీయూ పార్టీ కుల జనగణనను విజయవంతంగా చేపట్టిందని.. అలాగే వాటి వివరాలు కూడా విడుదల చేసిందని అన్నారు.
అలాగే బీసీ కులగణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుంతుందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ బీసీ కుల గణన జరిగినట్లైతే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,16 ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించినటువంటి రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదని.. బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్‌ను నేరవేర్చడం లేదని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిందని అన్నారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యమని.. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట ఉత్త ముచ్చటగానే మిగిలిపోయిందంటూ పేర్కొన్నారు. తక్షణమే బీసీ కుల గణనతో పాటుసమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇలా జరిగినప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందంటూ లేఖలో రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి