
కంచికచర్ల,ఫిబ్రవరి (ఆంధ్ర పత్రిక)::కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి మరియు వైయస్సార్ సిపి నాయకులు, ఉమ్మడి జిల్లా “యువజన”విభాగ ప్రధాన కార్య దర్శి పరిటాల.రాము గారికి అలాగే రాష్ట్ర”ఇండస్ట్రీస్ డెవల ప్మెంట్ “కార్పొరేషన్ డైరెక్టర్,కీసర మాజీ “సర్పంచ్ “పరిటాల.దివ్య గారికి ఆంధ్రపత్రిక డైరీని మరియు “మహాశివరాత్రి”ప్రత్యేక సంచికను వారికి వారి కార్యాల యాలలో ఆంధ్ర పత్రిక “రిపోర్టర్” నాగళ్ళ.ఉమాశంకర్ బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…స్వతంత్ర పోరాటంలో స్ఫూర్తిదాయకంగా నిలచిన ఆంధ్రపత్రిక డైరీ నీ మహాశివ రాత్రి ప్రత్యేక సంచికను మాకు బహుమతిగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి తనవంతు కృషి చేసిన “ఆంధ్రపత్రిక “2023 డైరీని “మహా శివరాత్రి”ప్రత్యేక సంచికను బహుమతిగా తీసుకోవడం గౌరవం గా భావిస్తున్నామని అన్నారు. శతాబ్దం పై చరిత్ర కలిగిన ఏకైక దినపత్రిక “ఆంధ్ర పత్రిక” మరెన్నో వార్త కథనా లతో కొత్త తరానికి సాంకేతికతో కూడిన వార్తలను అందిస్తూ నేటి తరం వారికి తీపి జ్ఞాపిక ఆంధ్ర పత్రిక అని అన్నారు.