అమరావతి: నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
ఆరోజుకు విచారణను వాయిదా వేసింది. కాగా దర్యాప్తు పేరుతో తనను వేధించినట్లు జెత్వానీ గున్నీతో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటాపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.