హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
నిర్ణీత కాలంలో నిర్మాణాలు జరపాలని ఎలా చెబతాం..
హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరించరాదని సుప్రీం వెల్లడి
విచారణ జనవరి 31 వాయిదా వేసిన ధర్మాసనం
న్యూఢల్లీి,నవంబర్ 28 (ఆంధ్రపత్రిక): అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట వచ్చింది. రాజధాని అమరావతిపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా ? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు
ఏమైనా టౌన్ ప్లానరా ? ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా ?. విూరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు ? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా ? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్టాన్న్రి ఆదేశించలేదని, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్టాన్రికి చెప్పలేం అని, ప్రతివాదులకు కోర్టు నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్‌లైన్ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 31కి వాయిదా వేసింది. ప్రతివాదులైన రైతులకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు తీర్పు చెప్పింది. రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది. ఆ సందర్భంగానే ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన డెడ్లైన్లు పెట్టింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్‌కు వెళ్లింది. దానిపై సోమవారం వాద, ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. హైకోర్టు తమ పరిధి దాటిందని, ఎగ్జిక్యూటివ్ పవర్స్‌ని కూడా హైకోర్టే అమలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఒకేచోట నగరాభివృద్ధి కేంద్రీకరించడం కంటే వేర్వేరు పట్టణాలను అభివృద్ధి చేయడం బెటరని, అలాంటప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడిరది. గతంలో ఏడు అంశాల వారీగా తీర్పు చెప్పింది హైకోర్టు. అందులో 3 నుంచి 7 అంటే ఐదు అంశాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పు మూడో అంశంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. 4వ అంశంలో మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 5వ అంశంలో అమరావతి కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ నిర్మాణాన్ని 6 నెలల్లో చేపట్టాలని ఆదేశించింది. 6వ అంశంలో అమరావతి కేపిటల్ సిటీని నివాసయోగ్యంగా మార్చాలని, ఏడో అంశంలో కేపిటల్ రీజియన్‌లో స్థలాల్ని రైతులకు 3 నెలల్లోగా కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఐదు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు. కాగా.. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీం స్టే విధించింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీం నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.