పోలవరం బకాయిలను.. 15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హావిూలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా.. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లిన సీఎం.. సుమారు 40 నిమిషాలపాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో.. వివిధ అంశాలపై వినితిపత్రం అందజేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2వేల 900 కోట్ల రూపాయలను.. తిరిగి చెల్లించాలని కోరారు. పోలవరం సాంకేతిక సలహా కమిటీ నిర్దారించిన.. 55 వేల 548 కోట్ల రూపాయల అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపోనెంట్‌వైజ్‌గా రీయింబర్స్ విధానానికి స్వస్తి పలకాలని, దీనివల్ల పనుల్లో.. విపరీత జాప్యం ఏర్పడుతోందన్నారు.ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం విషయంలోనూ మొత్తం వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు . రీసోర్స్ గ్యాప్ కింద రాష్టాన్రికి రావాల్సిన 32 వేల 625 కోట్ల రూపాయలను.. మంజూరు చేయాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ డిస్కంలనుంచి రావాల్సిన 6వేల756 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పిస్తే.. కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ కంపెనీలు ఒడ్డున పడతాయని.. ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని సీఎం తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన హావిూలను వినతిపత్రంలో పేర్కొన్నారు.ఇదే సందర్భంలో కేందరమంత్రులను,రాష్ట్రపతి ముర్మును కూడా జగన్ కలుసుకున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!