శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
వేపాడ, లక్కవరపుకోట, నవంబర్ 1 (ఆంధ్రపత్రిక) : నియోజకవర్గంలోని పట్టభద్రుల ఓట్ల నమోదును వేగవంతం చేయాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం నియోజకవర్గంలోని లక్కవరపుకోట శ్రావణి కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఎస్.కోట నియోజకవర్గంలో సుమారు 3600 ఓట్లు నమోదు చేశారని,ఈనెల 6వ తేదీ నాటికి కనీసం 6000 ఓట్లు నమోదు చేయాలని సూచించారు.ఈ ఎన్నికల్లో కూడా అధినేత సూచించిన అభ్యర్థిని ఆఖండ విజయంతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వేచలపు చిన రామనాయుడు,జామి వైసిపి కన్వీనర్ గొర్ల రవి, స్టేట్ డైరెక్టర్ వాకాడ రాంబాబు,జడ్పిటిసిలు సేనాపతి అప్పారావు, తూర్పాటి వరలక్ష్మి, ముమ్ములూరి వెంకటలక్ష్మి, ఎంపీపీలు దొగ్గ సత్యవంతుడు, నీలంశెట్టి గోపమ్మ,సండి సోమేశ్వర రావు, వైస్.ఎంపీపీలు ఇందుకూరి సుధా రాజు,కర్రి శ్రీను,అడపా ఈశ్వర రావు,మండల పార్టీ అధ్యక్షులు ముమ్ములూరి జగన్నాథం, కురాకు ల సూర్యారావు,ఒబ్బిన నాయుడు,నెడ్ కేఫ్ డైరెక్టర్ పద్మావతి, ఏఎంసీ వైస్ చైర్మన్ బొంతల వెంకటరావు, మెరపల సత్యనారా యణ, గుమ్మడి సత్యనారాయణ, గొరపల్లి రవి మరియు వివిధ గ్రామాలసర్పంచ్లు ఎంపిటిసిలు వైయస్సార్కార్యకర్తలు పాల్గొన్నారు.