హైదరాబాద్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోన్న నగరం. అయితే గత కొద్ది సంవత్సరాలుగా భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది. దీంతో సామాన్యులు ఇళ్లు కొనలేని స్థితి చేరారు.
అయితే గత సంవత్సరం అక్టోబర్ నుంచి రియల్ ఎస్టేట్ కాస్త నెమ్మదించింది. అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు రావడంతో మార్కెట్ స్తబ్ధుగా ఉంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడంతో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు మరింత తగ్గాయి.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తామని చెప్పడంతో పెట్టబడిదారులు అమరావతి వైపు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇంకా పిక్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. అయితే గత సంవత్సరంగా కాలంగా ఐటీ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంది.
మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు. 2022 జనవరి-జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్ట్రే షన్ కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు తగ్గాయి.
హైదరాబాద్ లో వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సాధారణంగా హైదరాబాద్లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుందని ధరలు ఎక్కువ ఉండడంతో వారు వెనకడుగు వేస్తున్నారని చెబుతున్నారు. అమరావతిని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేస్తే హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో ఇళ్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.