నవంబర్ 02 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ లో రీ`రిలీజ్లు ఇప్పుడు డ్రెండ్గా మారాయి. ఓల్డ్ హిట్ చిత్రాల్ని డాల్మి అట్మాస్ ఫార్మె ట్లో రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు. స్టార్ హీరోల బర్త్ డేల స్సెషల్‌గా రిలీజ్ అవుతోన్న రీ`రిలీజ్‌లకు ప్రేక్షకులు బ్రహ్మర్థం పడుతున్నారు. పరిమితి థియేటర్లలలోనే రిలీజ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగుంటున్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన చిరంజీవి..పవన్ కళ్యాణ్..ప్రభాస్ సినిమాలు చక్కని వసూళ్లని సాధించిన సంగతి తెలిసిందే. ఇకపై ఇదే విధానం మిగతా హీరోల విషయంలో కొనసా గుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ విజువల్ వండర్ ’అవతార్`2’ రిలీజ్‌కి ముందు ’అవతార్’ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ’అవతార్`2’ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ పొందాలంటే ముందు అవతార్‌ని ఓ సారి వీక్షిస్తే బాగుంటుంది! అన్న ఉధ్దేశంతో న్యూ టెక్నాలజీతో మరోసారి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా రీరిలీజ్ ల వెనుక బిజినెస్ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. తాజాగా బాలీవు డ్‌లోనూ ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తుంది. షారుక్ ఖాన్..కాజోల్ జంటగా నటించిన సంచలన ’దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. షారుక్ ఖాన్ 57వ పుట్టిన రోజు సందర్భంగా చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేస్తున్నట్లు యశ్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. బుధవారం నుంచి పీవీఆర్..సినీ పోలీక్స్.. ఐనాక్స్‌లో ప్రదర్శిస్తున్ల్ను తెలిపారు. ఇక సినిమా 1995లో ఎలాంటి సంచల నాలు నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. షారుక్ కాజోల్ కెరీర్లోనే ఓ మైల్ స్టోనీ మూవీగా నిలిచింది. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీగా ఖ్యాతికెక్కింది. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రమిది. ఈ విజయంతో షారుక్`కాజోల్ రొమాంటిక్ జోడీగా పేరు సంపాదించారు. అలాంటి సిని మా మళ్లీ రిలీజ్ అయితే మోత తప్పదనే చెప్పాలి. ఇదే తరహాలో మిగతా స్టార్ హీరోల చిత్రాలు పుట్టిన రోజు సందర్భంగా రీ`రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అవిూర్ ఖాన్…హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోల ఓల్డ్ క్లాసిక్ హిట్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తే విధ్వంసమే.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!