నవంబర్ 24 (ఆంధ్రపత్రిక): స్టార్ హీరో రాంచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ఆర్సీ 15 న్యూజిలాండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా రాంచరణ్ హెయిర్‌స్టైలిష్ట్ ఆలీమ్ హకీంతో సరదాగా చిట్‌చాట్ చేస్తున్న స్టిల్‌ను నెట్టింట షేర్ చేశాడు. సినిమాలో వచ్చే డ్యుయెట్ సాంగ్ గురించి ఈ ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగినట్టు అప్డేట్తో క్లారిటీ ఇచ్చాడు చరణ్. బోస్కొ మార్టిస్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నాడు. వారంపాటు సాగే షెడ్యూల్లో ఈ పాటను షూట్ చేయనున్నారు. షూట్ అయిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో రాంచరణ్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఆర్సీ 15 చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బ్జడెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!