కస్టమర్లకు ఆర్బిఐ షాక్
25 బేసిక్ పాయింట్లు పెరిగిన రెపోరేటు
రుణగ్రహీతలకు మరింత భారం కానున్న రుణాలు
పెరగనున్న గృహరుణాల ఇఎంఐలు
ముంబై,ఫిబ్రవరి 8 : ఆర్బిఐ మరోమారు షాక్ ఇచ్చింది. రెపోరేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణదాతలకు భారం కాబోతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరుగుతోంది. బుధవారం మూడో రోజు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రెపోరేటు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 25 బేసిస్ పాయింట్లు పెంచు తున్నట్లు స్పష్టం చేశారు. 6.25 నుంచి 6.50 శాతానికి రెపోరేటును పెంచింది. 2023 ఏప్రిల్`జూన్ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా. ఈ రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఆర్బీఐ వద్ద బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటునను తగ్గిస్తే బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది.బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వవచ్చు. అలా బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు. ఇది రెపో రేటు కన్నా తక్కువగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ బుధవారం విూడియాతో మాట్లాడారు. రెపోరేటను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆయన తెలిపారు. రెపో రేటు పెంపుతో మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో రుణ ఈఎంఐలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ రెపో రేటును పెంచడం ఇది వరుసగా ఆరోసారి. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు శక్తికాంత్ దాస్ చెప్పారు. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరుకున్నది. కొన్ని నెలల క్రితం ఉన్న ప్రపంచ ఆర్ధిక స్థితి ఇప్పుడు లేదని, చాలా వరకు పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ప్రగతి కనిపిస్తోందని, కానీ ద్రవ్యోల్బణం స్వల్ప స్థాయిలో ఉన్నట్లు దాస్ వెల్లడిరచారు. 2023`24లో నాలుగవ క్వార్టర్లో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతం ఉండే అవకాశాలు ఉన్నట్లు దాస్ చెప్పారు. ఈ ఏడాది వాస్తవ జీడీపీ 6.4 శాతంగా ఉంటుదని ఆయన అన్నారు.