Ravindra Jadeja: ఐపీఎల్ 16వ సీజన్ టోర్నీ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మే 29న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్స్ కొట్టి ధోని సేనను గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు…
ఐపీఎల్ 16వ సీజన్ టోర్నీ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మే 29న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్స్ కొట్టి ధోని సేనను గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్‌ని సమం చేసింది చెన్నై సూపర్ కింగ్స్. చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో జడేజా తన సమయస్ఫూర్తితో 6, 4 కొట్టాడు. అయితే ఈ విజయం తర్వాత జడేజా హృదయాన్ని గెలుచుకునే పని చేశాడు. ఏ బ్యాట్‌తో అయితే జడేజా విన్నింగ్ షాట్స్ కొట్టి చెన్నైని గెలిపించాడో.. దాన్ని ఐపీఎల్ డెబ్యూ కూడా చేయని యువ ఆటగాడికి బహుమతిగా ఇచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లో సభ్యుడైన యువ ఆటగాడు అజయ్ మండల్‌కి ఇంతవరకు ఐపీఎల్ క్రికెట్ ఆడేందుకు అవకాశం రాలేదు. ఇక ఈ యువ బ్యాటర్‌ను ప్రోత్సహించేందుకు పూనుకున్న జడ్డూ భాయ్.. తన బ్యాచ్‌ని అజయ్‌కి స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని అజయ్ తన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశాడు. ఇక అజయ్ పెట్టిన స్టోరీ స్క్రీన్ షాట్ రూపంలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ బ్యాట్‌కి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన అజయ్.. ఫైనల్ మ్యాచ్ చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసిన బ్యాట్‌ను రవీంద్ర జడేజా తనకు బహుమతిగా ఇచ్చాడని.. ఇందుకు జడేజాకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే జడేజాతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం ఇచ్చిన చెన్నై ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అజయ్ మండల్
దేశవాళీ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్ తరపున ఆడుతున్న అజయ్ మండల్ మధ్యప్రదేశ్‌లో జన్మించాడు. అజయ్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంకా రైడ్ హ్యాండ్ బ్యాట్స్‌మ్యాన్. చెన్నై ఈ సీజన్లో అజయ్‌ను రూ. 2.5 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది.