నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): సూపర్ స్పీడ్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో అతను నటిస్తుండగా, వాటిలో ముందుగా రాబోతున్న సినిమా ’ధమాకా’. నక్కిన త్రినాథరావు దర్శకుడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. జయరామ్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో పాటు ’జింతాక్’ అనే పాటను విడుదల చేసిన టీమ్, శుక్రవారం మరో పాటను రిలీజ్ చేసింది. ’వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై దిల్లో.. వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ మై వేలో’ అంటూ సాగే ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా రమ్య బెహ్రా, భార్గవి పిల్ళై పాడారు. రామజోగయ్య శాస్త్రి రాశారు. ’పది గంటలకే పడుకునేదాన్ని, వీడు వచ్చాకేమో రెండవుతోందే.. గది గడపలనే దాటనిదాన్ని తిరిగొచ్చే టైమ్ ఏమో ఏడవుతోందే .. బుజ్జి అంటూ, కన్నా అంటూ, వాడంటుంటే పడిచస్తున్నా’ అని ప్రేమలో పడ్డ కొత్తలో హీరోయిన్, హీరో గురించి పాడుకుంటున్నట్టుగా ఉంది. ’డబుల్ ఇంపాక్ట్’ క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు రాస్తున్నాడు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 23న విడుదల కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!