ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న నెటిజన్లు
డిసెంబర్ 29 (ఆంధ్రపత్రిక): ఈ మధ్య రష్మిక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతుంది. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ గురవుతుంది. తాజాగా ఈ బ్యూటీ సౌత్ సినిమాలపై చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తుంది. కాగా ఆమె నటించిన ’మిషన్ మజ్ను’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లు జరుపుతుంది. తాజాగా రష్మిక ఈ సినిమా ప్రమోషన్ల కోసం ముంబైకి వెళ్లింది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుండి ’రబ్బా జాండా’ అనే రొమాంటిక్ పాటను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. ఇక సాంగ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని తెలిపింది. అంతటితో ఆగకుండా సౌత్ సినిమాల్లో ఇలా ఉండదని.. సౌత్‌లో ఎక్కువగా మాస్ మసాలా, ఐటెమ్ సాంగ్స్ ఉంటాయని సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడిరది. దాంతో నెటీజన్లు రష్మికపై మండిపోతున్నారు.సోషల్ విూడియాలో రష్మికను తెగ ట్రోల్ చేస్తూ.. కన్నడ నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో కన్నడ సినిమాలను తక్కువ చేసి మాట్లాడావు, ఇక ఇప్పుడు హిందీ సినిమాలలో నటించేటప్పటికి సౌత్‌ని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్. ఇది కరెక్ట్ కాదని, నోరును అదుపులో పెట్టుకోవాలని కామెంట్స్ చేస్తూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.