తెలుగులో ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది రష్మిక. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగులో ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది రష్మిక. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆతర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. ఇక బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటుంది.
ఇక ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా అభిమానులు చేసిన పనికి షాక్ అయ్యింది రష్మిక.
తాజాగా అభిమానులను కలిసింది రష్మిక. ముంబైలో ఓ షూటింగ్ సెట్ కు అభిమానులు వచ్చిన సమయంలో వారికీ ఫోటోలు ఇచ్చింది రష్మిక. అయితే అభిమానులు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటుండగా ఓ అభిమాని ఫోన్ ను సరిగ్గా పట్టుకోలేకపోయాడు.. దాంతో రష్మిక అతడి ఫోన్ ను సరిచేసి ఫోటో దిగబోయింది. కానీ ఇంతలో మరో అభిమాని ఆమె చేతి నుంచి ఆ ఫోన్ ను లాగేసుకున్నాడు. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.