బౌలింగ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ బౌలర్, విండీస్ ఆటగాడు షెల్డన్ కాట్రెల్ తన కోటా 2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి, మరో ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తంగా 3 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్లోనే మెయిడిన్ ఓవర్ వేయడం గగనమైపోయిన ఈ రోజుల్లో టీ10 ఫార్మాట్లో మెయిడిన్ వేసిన కాట్రెల్ రికార్డు సృష్టించాడు.
బ్యాటింగ్ విషయానికొస్తే.. 60 బంతుల మ్యాచ్‌లో ఒకే బ్యాటర్ సగానికి పైగా బంతులు (33) ఎదుర్కోవడం ఆషామాషి విషయం కాదు. ఇది ఓ రికార్డు కూడా. గతంలో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఎదుర్కొన్న 32 బంతులే టీ10 క్రికెట్లో ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యుత్తమం. తొలి ఓవర్ మెయిడిన్ అయ్యాక, ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బరిలోకి దిగిన ఫెరియెరా ఆఖరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి టీ10 ఫార్మాట్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో క్రిస్ లిన్ (30 బంతుల్లో 91; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది.