దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ ’రానా నాయుడు’. యాక్షన్ కైమ్ర్ డ్రామాగా రూపొందించిన ఈ సిరీస్‌ని కరణ్ అన్షుమన్ రీ క్రియేట్ చేశాడు. అమెరికన్ టీవీ సిరీస్ ’రే డొనోవన్’ ఆధారంగా ఈ సిరీస్ ని రీమేక్ చేశారు. హిందీలో ప్రధానంగా నిర్మించిన ఈ సిరీస్‌ని తెలుగు లోనూ రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ప్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీటింగ్ కానుంది. రానా వెంకటేష్ తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించారు. రానా వెంకటేష్ లకు ఇదే తొలి వెబ్ సిరీస్. దీంతో వీరిద్దరు ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాబాయ్ అబ్బాయ్ పోటా పోటీగా నటించిన ఈ వెబ్ డ్రామాలో ఇద్దరి మధ్య సాగే వైరం ప్రధాన హైలైట్ గా నిలవబోతోంది. అంతే కాకుండా చాలా రూడ్ క్యారెక్టర్ లో రానా పాత్రని డిజైన్ చేసిన తీరు కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోనుంది. ఇటీవల ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్ లో ఈ సిరీస్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో హల్ చల్ మొదలు పెట్టిన బాబాయ్ అబ్బాయ్ ఈ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో గట్టి ఇంపాక్ట్ ని కలిగించడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. తండ్రి కోడుకులుగా వెంకటేష్ రానా నటించారు. అయితే ఇద్దరి మధ్య వైరం ఎందుకు మొందలైంది.. నారా నాయుడుకు నాగా నాయుడు కున్న పగ వెనకున్న అలసు కథేంటి? అన్నదే ఇందులో ఆసక్తికరం. అయితే విక్టరీ వెంకటేష్ కున్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ ని మాత్రం ఈ సిరీస్ డ్యామేజ్ చేసేలా వుందని అభిమానులు వాపోతున్నారు. రానాని వుద్దేశించి వెంకటేష్ పలికిన సంభాషణలు ఇద్దరి నేపథ్యంలో వచ్చే క్రూషియల్ సీన్స్ వెంకీ కాలర్ ని రానా పట్టుకుని పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరిస్తున్న సన్నివేశాలు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని వెంకీకి దూరం చేసేలా వున్నాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మార్చి 10 నుంచి హిందీ తెలుగు భాషల్లో నెట్ ప్లిక్స్ లో ఈ సిరీస్ స్టీమ్రింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని షేర్ చేస్తూ రానా వెంకటేష్ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేశారు. తండ్రీ కొడుకులు బద్ద శత్రువులుగా మారితే ఏం జరుగుతుంది? .. మార్చి 10న నెట్ ప్లిక్స్ లో చూడిరడి’ అంటూ పోస్ట్ పెట్టారు. ’రానా బాప్ నుంచి ఆప్ ని తీసేస్తాడు… మార్చి 10న నేనూ నాగా ముఖాముఖిని మార్చి 10న నెట్ ప్లిక్స్ లో చూడండి’ అంటూ రానా షేర్ చేశాడు. ఇదే సందర్భంగా వెంకటేష్ జైలు నుంచి విడుదలైన వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండవుతోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!