డిసెంబర్ 11 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ క్రేజీ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చి ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. తన మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు. ఆ సినిమా వచ్చిన రెండు సంవత్సరాలకు రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ఓ సినిమా ప్రకటించాడు.. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు కూడా బయటకు వచ్చాయి. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌కు కథ చెప్పి సినిమా ఓకే చేపిచ్చుకున్నాడని టాక్ కూడా నడిచింది.కానీ ఎన్టీఆర్ కమిట్ అయిన కొరటాల సినిమా ఇంకా షూటింగ్ మొదలవ్వకపోవడంతో బుచ్చిబాబు సినిమా క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. ఆ తర్వాత బుచ్చిబాబు, రామ్ చరణ్ తో తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను కూడా వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చరణ్ తో చేయబోయే సినిమా కథను ఎన్టీఆర్ కోసం రాసిన కథని ఇప్పుడు బుచ్చిబాబు చరణ్‌తో చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఆ సినిమాను స్పోర్ట్స్ డ్రామా అని దానికోసం శారీరకంగా కూడా మార్పులు అవసరమవుతాయట. ఈ సినిమాలో హీరో తన ఆటల్లో కాళ్లు రెండు పోగొట్టుకుని అంగవైకల్యం పొందిన వ్యక్తిగా కనిపిస్తాడట. ఆ తర్వాత అతను ఎలా ముందుకు వెళ్లాడు తన గోల్ ఎలా రీచ్ అయ్యాడు అనేది సినిమా కథ. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే మరి బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో అనుకున్న కథని రామ్ చరణ్‌తో తీసి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!