ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆకాశానికి చేరింది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ వరకు మాత్రమే టాప్ హీరోగా ఉన్న రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మరో హీరోయిన్ గా అంజలి నటించనుంది. ఇక ఈ సినిమాకు గేమ్ చెంజర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు బుచ్చిబాబు. ఇక ఈ సినిమాతర్వాత చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. మృణాల్ ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో చేస్తోంది. త్వరలోనే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పై క్లారిటీ రానుంది.