రక్షిత్ అట్లూరి హీరోగా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ అనే సినిమా షురూ అయింది. విశ్వేశ్వర శర్మ, రాజరాయ్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.తొలి సీన్‌కి నిర్మాత ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ చందు మొండేటి క్లాప్ కొట్టారు.అనంతరం గొల్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ-”సస్పెన్స్, యాక్షన్ డ్రామా, పోలీస్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది” అన్నారు.
”వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది” అన్నారు రక్షిత్. ”మా సినిమాలో నటించే ఇతర నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణల వివరాలు త్వరలో తెలియజేస్తాం” అన్నారు విశ్వేశ్వర శర్మ.