నవంబర్ 01 (ఆంధ్రపత్రిక): అహనా పెళ్లంట 17నుంచి స్ట్రీమింగ్ కెరీర్ బిగెనింగ్‌లోనే హాట్రిక్ విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు యువ హీరో రాజ్ తరుణ్. ఆయితే అదే జోష్‌న తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ’ఉయ్యాలజంపాల’, ’సినిమా చూపిస్త మామ’, ’కుమారి 21ఎఫ్’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్ లేదు. డిఫరెంట్ జానర్‌లలో సినిమాలు చేస్తున్నా.. రాజ్‌తరుణ్‌కు మాత్రం హిట్టు వరించడం లేదు. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ’స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు. రాజ్‌తరుణ్ తాజాగా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ’ఆహా నా పెళ్లంట’ వెబ్‌సిరీస్ ’జీ`5’లో నవంబర్ 17నుండి స్ట్రీమిగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. హీరో చిన్నప్పుటి నుండి ఏ అమ్మాయిని చూడకూడదు అని తల్లి ఒట్టు వేయించుకుంటుంది. అయితే విచిత్రంగా హీరో అమ్మాయిలను చూసిన ప్రతీ సారీ ఏదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో అతను అమ్మాయిల వైపు చూడటమే మానేస్తాడు. చివరకు పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడమని హీరో ఇంట్లో చెప్తే.. తీరా పెళ్లి ఫిక్స్ అయ్యాక తన లైఫ్ లోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత హీరో లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది.ఈ వెబ్‌సిరీస్‌లో రాజ్‌తరుణ్‌కు జోడీగా శివాణీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటించింది. టీజర్‌తోనే చిత్రబృందం వెబ్ సిరీస్‌పై మంచి అంచనాలు నెలకొల్పింది. జీ`5తో కలిసి తమాడా విూడియా సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లుగా రూపొందింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!