73 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేస్తున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్, లాల్ సలామ్ సినిమాల తర్వాత తలైవా నటిస్తోన్న చిత్రం తలైవర్ 171 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
73 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేస్తున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్, లాల్ సలామ్ సినిమాల తర్వాత తలైవా నటిస్తోన్న చిత్రం తలైవర్ 171 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు . దీని షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు . టైటిల్ టీజర్ చూసిన రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రజనీకాంత్ తన చేతికి కూలీ అనే బ్యాడ్జ్ ధరించి ఎంట్రీ ఇచ్చాడు. టీజర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో చూపించారు. అయితే అందులో ఉన్న గోల్డ్ మెటీరియల్ మాత్రమే కలర్ లోచూపించారు. దీంతో సినిమా కథ గురించి ఓ హింట్ ఇచ్చారు. బంగారం, వజ్రాల వాచీల స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
కాగా టీజర్ ద్వారా అభిమానుల్లో క్యూరియాసిటీని రేకెత్తించడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడు. అతని గత సినిమాల్లాగే ఇందులోనూ యాక్షన్ సీక్వెన్స్ కు కొదవ లేదని పిస్తోంది. కూలీ’ సినిమా టైటిల్ టీజర్‌ను లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. లోకేష్ కాగన్రాజ్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా ఇదే తొలిసారి కావడంతో సహజంగానే హైప్ పెరిగింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లోని నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకుంది.