పల్నాడు జిల్లా,సెప్టెంబర్ 25 (ఆంధ్రపత్రిక):
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన నియోజకవర్గ వై.యస్.ఆర్.చేయూత కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. చిలకలూరిపేట నియోజకవర్గంలో 13,626 లబ్ధిదారులకు కాను 25 కోట్ల 55 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు,అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు.
అనంతరం పాత్రికే సమావేశంలో మంత్రి రజిని మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన అక్క, చెల్లెమ్మలకు వైయస్సార్ చేయూత పథకం నియోజకవర్గానికి 25 కోట్లు రూపాయలు డైరెక్ట్ గా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి జమ చేశారు అని మూడో విడతతో కలిపి మొత్తం చిలకలూరిపేట నియోజకవర్గానికి 75 కోట్లు అక్కచెల్లెమ్మల అకౌంట్లో పడినాయని మంత్రి రజిని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయంతో అవమానించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏం చేశారంటూ, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలను ఉద్దేశించి మంత్రి విడుదల రజిని విమర్శించారు.
అదేవిధంగా అధికారంలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ గుర్తొస్తారని
అధికారంలో ఉంటే పట్టించుకున్న పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో మూడు వైద్య కళాశాలలు పెడితే
ఆయన తనయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలలు తీసుకొచ్చారన్నారు.
ఆరోగ్యశ్రీ తో పాటు 108, 104, 20 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైయస్సార్ పేరు పెట్టడంలో తప్పు లేదని మంత్రి స్పష్టం చేశారు.