డిసెంబర్ 29 (ఆంధ్రపత్రిక): సాయి రోనక్, అంకిత సాహా జంటగా రామ్ గణపతి రూపొందించిన చిత్రం ’రాజయోగం’ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి రోనక్ మాట్లాడుతూ ’ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్. రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. డ్రైవర్‌గా కనిపిస్తా. ఓనర్ స్థానంలో ఒక అమ్మాయిని కలిసేందుకు పెద్ద హోటల్‌కు వెళ్తా. నేను రిచ్ అని ఆమె, ఆ అమ్మాయికి డబ్బుందని నేను అంచనాలు పెంచుకుంటాం. ఈ డ్రామా చివరకు ఎలా ముగిసింది అనేది కథ. పదివేల కోట్లు విలువైన డైమండ్స్ అనే పాయింట్ కూడా ఆసక్తి రేపుతుంది. ఫైట్స్, డాన్స్ లాంటి అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. రొమాంటిక్ సీన్స్ ఉన్నా ఇబ్బంది పెట్టేలా ఉండవు. నేను కొందరు స్టార్స్‌కు డ్యాన్సులు నేర్పించా. ఆ స్కిల్ చూపించే అవకాశం ఇందులో దక్కింది. ఒకే జానర్‌కు ఫిక్స్ అవకుండా డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తున్నా. నీలకంఠ డైరెక్ట్ చేస్తున్న థ్రిల్లర్‌తో పాటు ఉషాకిరణ్ బ్యానర్‌లో ఓ సినిమా, అవికా గోర్‌తో ’పాప్ కార్న్’ అనే సినిమా చేస్తున్నా. ఇవన్నీ నాకు వెర్సటైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెస్తాయని ఆశిస్తున్నా’ అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!